మనసైన నా ప్రియా...


మనసైన నా ప్రియా...
చిత్రం : ఆహా (1998)
సంగీతం : వందేమాతరం  శ్రీనివాస్
గానం : హరిహరన్

మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...

మనసైన నా ప్రియా...
కలిగేన నీ దయా...
కలలతో... కళలతో...
కొత్తగా కవినయా...

యవ్వనాల పువ్వులన్ని



యవ్వనాల పువ్వులన్ని
డిటెక్టివ్ నారద (1993)
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: ఇళయరాజా

పల్లవి:

యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో 
ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో హహహ అ
కులుకు లొలుకు చెలి చెంతనుండగా 
వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో 
ప్రేమయాత్ర చేద్దామా హహహ
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

సువ్వి సువ్వమ్మ సువ్వి


సువ్వి సువ్వమ్మ సువ్వి
చిత్రం : ఆహా (1998)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : ఉన్నికృష్ణన్, సుజాత
రచన: సిరివెన్నెల

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా........
సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి........
నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులే....... 

జుమ్మని తుమ్మదె ఎగిసి


జుమ్మని తుమ్మదె
డిటెక్టివ్ నారద (1993)
గాత్రం: బాలు,చిత్ర
సంగీతం: ఇళయరాజా

పల్లవి:

జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి
ఆశపడ్డ పాప నీరు లేని చేప
ఆటకట్టిపోతే బ్రతుకు బాట బలి
కన్నె పరువు వెలి
జుమ్మని తుమ్మదె ఎగిసి
జాం జమ్మని రమ్మని పిలిచి
జల్లని జిల్లని తగిలి
ఘల్ ఘల్లని ఘల్లని రగిలి

పడుచుదనం రైలు బండి పోతున్నది


పడుచుదనం రైలు బండి
చిత్రం :  పెంకి పెళ్ళాం (1956)
సంగీతం :  కె. ప్రసాదరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  జిక్కి

పల్లవి :

పడుచుదనం రైలు బండి పోతున్నది
పడుచుదనం రైలు బండి పోతున్నది
వయసు వాళ్ళ కందులో చోటున్నది
పడుచుదనం రైలు బండి పోతున్నది
ఆ...ఆ..  పోతున్నది

కస్తూరి తిలకం లలాట ఫలకే


కస్తూరి తిలకం లలాట ఫలకే
చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : వేటూరి
గాత్రం : రాధిక, శంకర్ మహదేవన్, కోరస్

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం

వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం
రేపల్లె మానందనం ఓ.. వేనోళ్ళ నీ కీర్తనం
ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసె
ఆలారే......

ఇప్పటికిప్పుడు రెప్పల్లో


ఇప్పటికిప్పుడు రెప్పల్లో
ప్రేమకు వేళాయెరా(1999)
చిత్ర, ఉన్ని కృష్ణన్,
ఎస్.వి. కృష్ణారెడ్డి

ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో

ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి
ప్రేమకి వేళయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి

ఏం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎలా మరి
మాటలేవి వద్దు చేరుకోమని
చిలికి చినికి ఉలికి పడే
చిలిపి వలపు చినుకు సడి

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ


సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం
వర్గం: వీధిగాయకుల పాట
పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం)
పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ

సుక్కబొట్టు పెట్టనీడు

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది…

వర్గం: జట్టిజాం పాట

పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం)

సుక్కబొట్టు పెట్టనీడు
సుట్టాల సూడనీడు
ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ
ఎన్నాళ్ళు కాయిలుంటడో

ఊరూ నిదరోయింది..


ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది 
రాయలసీమ జానపదగీతం
పాడినవారు: స్వర్ణలత
సంగీతం: జి. ఆనంద్

ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది
మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని
బావా… నన్ను సేరుకోవా!
బావా… నన్నందుకోవా!!