Showing posts with label మిస్టర్ మజ్ను (2019). Show all posts
Showing posts with label మిస్టర్ మజ్ను (2019). Show all posts

నాలో నీకు నీలో నాకు

నాలో నీకు నీలో నాకు
చిత్రం : మిస్టర్ మజ్ను (2019)
సంగీతం : థమన్ ఎస్.ఎస్.
సాహిత్యం : శ్రీమణి
గానం : కాలభైరవ, శ్రేయ ఘోషల్

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా

నాకే సాధ్యమా నిన్నే మరవడం
నాదే నేరమా నిన్నే కలవడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళుతున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలెనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనుక నీరే
నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం
ఉందని తెలుపక

నువ్వని ఎవరని
తెలియని గురుతుగా
పరిచయం జరగనే
లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక
మరిచే వీలు లేనంతా
పంచేసావె ప్రేమంతా
తెంచెయ్‌మంటే
సులువేం కాదుగా

మనసులే కలవడం
వరమా శాపమా
చివరికి విడవడం
ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా