Showing posts with label కాలభైరవ. Show all posts
Showing posts with label కాలభైరవ. Show all posts

రాజర్షి..... మహానాయకుడు

రాజర్షి.....
చిత్రం : మహానాయకుడు (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : శంకరాచార్య నిర్వాణ షట్కము,
కె.శివదత్త, కె.రామకృష్ణ, కీరవాణి
గానం : శరత్ సంతోష్, మోహన భోగరాజు,
కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

తల్లి ఏదీ? తండ్రి ఏడీ?
అడ్డుతగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసు పొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్లు
నీదంటు ఏ చింత
సుంతైన లేని ఈ నేలపై
నడయాడు ఋషివో..

కృషితో నాస్తి దుర్భిక్షమని
లోకాన్ని శాసించు మనిషివో..
ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో..
నీవెవరివో.. ఎవరివో..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

జాగృతములో జాగు ఏదీ?
రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా..
అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగీ

కదనరంగాన కర్మయోగీ..

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు
నిష్క్రియాప్రచ్ఛన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు
నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు
మహా నాయకుడు ఇతడు...
మహా నాయకుడు ఇతడు...

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..

వందేమాతరం.. వందేమాతరం..



వందేమాతరం.. వందేమాతరం..
చిత్రం : ఆపరేషన్ 2019 (2018)
సంగీతం : రాప్ రాక్ షకీల్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : కాలభైరవ

వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..
మేరా ధర్తీ.. మేరా మిఠ్టీ..
మేరా పానీ.. మేరా హవాయే..
వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

మేరా ధర్తీ.. మేరా మిఠ్టీ..
మేరా పానీ.. మేరా హవాయే..
వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

తేరి మొహబ్బత్ కహీ నహీ
హర్ పల్ హర్ దమ్ తేరే నామ్
తేరి మొహబ్బత్ కహీ నహీ
హర్ పల్ హర్ దమ్ తేరే నామ్
మేరా భారత్ మహాన్..
మేరా భారత్ మహాన్..

వందేమాతరం.. వందేమాతరం..
వందేమాతరం.. వందేమాతరం..

నా దేశమందు ఎందెందు
వెతికినా తల్లిదనం
నా భూమిలోన ప్రతి కణం
కణంలో దైవ గుణం
నా దేశం శాంతి పావురం
నా భూమి బంగారు గోపురం
నా హృదయం హిందూ సాగరం
నా సదనం హిమ నగ సుందరం

వందేమాతరం.. వందేమాతరం..

ఎంత శుభోదయం..
ఎంత నవోదయం..
ఎంత విప్లవోదయం..
ఇంతకంటె నా కంటి పాపలకు
ధన్య సార్ధకత ఏముంది..
గాంధీజీ చేతికర్ర
నా జాతి వెన్నెముక అయ్యిందో
వందేమాతరమే ప్రతి గుండెలో
సుప్రభాతమై మోగిందో..

వందేమాతరం.. వందేమాతరం..

నాలో నీకు నీలో నాకు

నాలో నీకు నీలో నాకు
చిత్రం : మిస్టర్ మజ్ను (2019)
సంగీతం : థమన్ ఎస్.ఎస్.
సాహిత్యం : శ్రీమణి
గానం : కాలభైరవ, శ్రేయ ఘోషల్

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా
నీ కబురింక విననంటున్న హృదయానా
నువ్వే నిండి ఉన్నావంది నిజమేనా

నాకే సాధ్యమా నిన్నే మరవడం
నాదే నేరమా నిన్నే కలవడం
ప్రేమను కాదనే బదులే ఇవ్వడం
ఏదో ప్రశ్నలా నేనే మిగలడం

గాయం చేసి వెళుతున్నా
గాయం లాగ నేనున్నా
ప్రాయం ఇంత చేదై మిగిలెనా
గమ్యం చేరువై ఉన్నా
తీరం చేరలేకున్నా
దూరం ఎంత జాలే చూపినా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కాని ప్రేమే వదులుకుంటున్నా

ఓ నవ్వే కళ్లతో బ్రతికేస్తానుగా
నవ్వుల వెనుక నీరే
నువ్వని చూపక
తియ్యని ఊహల కనిపిస్తానుగా
ఊహల వెనుక భారం
ఉందని తెలుపక

నువ్వని ఎవరని
తెలియని గురుతుగా
పరిచయం జరగనే
లేదంటానుగా

నటనైపోదా బ్రతుకంతా
నలుపైపోదా వెలుగంతా
అలుపే లేని ఆటే చాలిక
మరిచే వీలు లేనంతా
పంచేసావె ప్రేమంతా
తెంచెయ్‌మంటే
సులువేం కాదుగా

మనసులే కలవడం
వరమా శాపమా
చివరికి విడవడం
ప్రేమా న్యాయమా

నాలో నీకు నీలో నాకు సెలవేనా
ప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నా