Showing posts with label అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003). Show all posts
Showing posts with label అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003). Show all posts

నీవే నీవే నీవే నేనంటా



నీవే నీవే నీవే నేనంటా
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి (2003)
పెద్దాడమూర్తి
చక్రి

పల్లవి: 

నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా

చరణం 1: 

నా కలలని కన్నది నీవే
నా మెలకువ, వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా

నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు, దిగులూ నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా

కనిపించకపోతే వెన్నై వెతికావే
కన్నీరే వస్తే... కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా

చరణం 2: 

నే గెలిచిన విజయం నీదే
నే ఓడిన క్షణము నాకై
నా అలసట తీరే తావే నీవేగా

అడుగడుగున నడిపిన దీపమా 
ఇరువురికే తెలిసిన స్నేహమా 
మది మురిసే ఆనందాలే నీవేగా

జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే