Showing posts with label ఖుషి ఖుషీగా (2004). Show all posts
Showing posts with label ఖుషి ఖుషీగా (2004). Show all posts

తియ్యని ఈ నిజం


తియ్యని ఈ నిజం
ఖుషి ఖుషీగా (2004)
ఉమా మహేశ్వరరావు
ఎస్.ఏ.రాజ్ కుమార్
హరిహరన్, మాతంగి

తియ్యని ఈ నిజం చెప్పనా...
నిను చేరింది మనసే...
దాగని ఈ నిజం విప్పనా...
నిను కోరింది వయసే...
నా ప్రతీ ఊహలో నువ్వే ఉన్నావనీ...
ఈ ప్రియభావన తెలిపే రోజేదనీ...
నిలదీసాను చిరుగాలినీ...

||తియ్యని||

యవ్వనం నిధిలా దాచి..
ఇవ్వనా కానుక చేసి
వేచి... తలుపు తెర తీసీ...
తారలా మెరిసే చెలికి
చేరనా తళుకై దరికి
నీడై ఆమెకొక తోడై...
ఇలా ఎంత కాలం సదా బ్రహ్మచర్యం...
ఎలా చేరుకోను ప్రియా ప్రేమసౌధం...
తెలియకనే అదిరినదా అధరం...
నా యెదలో నీ స్వప్నం మధురం...
దరి చేరాలి మురళీధరా...

||తియ్యని||

నిన్ను నా సిగలో తురిమి
చెయ్యనా త్వరగా చెలిమి
యోగి.. ప్రేమ రసభోగి...
రాలుతూ చినుకై ఎదుట
రాత నై చెలి నీ నుదుట
ఉంటా పైట పొదరింటా
ఎలా దాచుకోను ప్రియా కన్నె ప్రాయం...
ఇలా ఇవ్వరాద చెలీ సొగసు దానం...
నీ తలపే ప్రతి నిముషం మురిపెం..
నీ కొరకే నా హృదయం పయనం...
ఇటు రావయ్య నవ మన్మధా...

||తియ్యని||