కరుణామయుడు (1978)
రచన: మోదుకూరి జాన్సన్
సంగీతం: బి. గోపాలం
గానం: బాలు, విజయచందర్
కదిలిందీ కరుణరథం
సాగిందీ క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగె కాంతిపథం
కదిలింది కరుణరథం
సాగింది క్షమాయుగం
మనిషి కొరకు దైవమే...
మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగె కాంతిపథం
కదిలింది కరుణరథం...
మనుషులు చేసిన పాపం
మమతల భుజాన ఒరిగింది
పరిశుద్ధాత్మతో పండిన గర్భం
వరపుత్రునికై వగచిందీ వగచింది
దీనజనాళికై దైవకుమారుడు
పంచిన రొట్టెలే రాళ్ళైనాయి
పాప క్షమాపణ పొందిన హృదయాలు
నిలువున కరిగీ నీరయ్యాయి...
నీరయ్యాయి
అమ్మలారా నాకోసం ఏడవకండి
మీకోసం పిల్లలకోసం ఏడవండి
ద్వేషం
అసూయ
కార్పణ్యం
ముళ్ళ కిరీటమయ్యిందీ
ప్రేమ
సేవ
త్యాగం
చెలిమి నెత్తురై ఒలికిందీ...
ఒలికింది
తాకినంతనే స్వస్థతనొసగిన
తనువుపై కొరడా ఛెళ్ళంది
అమానుషాన్ని అడ్డుకోలేని
అబలల ప్రాణం అల్లాడింది...
అల్లాడింది
ప్రేమ పచ్చికల పెంచిన కాపరి
దారుణహింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొఱ్ఱెలు
చెల్లాచెదరై కుమిలాయి
చెల్లాచెదరై కుమిలాయి
పరమవైద్యునిగ పారాడిన పవిత్రపాదాలు
నెత్తురుముద్దగ మారాయి...
అభిషిక్తుని రక్తాభిషేకంతో
ధరణి ధరించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరి రాళ్ళు
కలవరపడి కలవరపడి కలవరపడి
అరిచాయి అరిచాయి
No comments:
Post a Comment
Leave your comments