తెలంగాణా జానపదం
గానం: మంగ్లీ, నాగవ్వ
సంగీతం: సురేశ్ బొబ్బిలి
రచన: కమల్ ఎస్లావత్
పల్లవి:
బాయిలోనే బల్లి పలికే ..
బండసారం శిలలొదిలే
బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి ..
ఏడువేలా జోడుంగురాలో
ఎర్రాని
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకుని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే…
బాయిలోనే బల్లి పలికే ..
బాయిలోనే బల్లి పలికే ..
బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత..
బాజరులా బాలలంత..
బత్తీసాలాడంగో బాజరులా
చరణం 1:
ఓయ్ పిలగా
శింతా శింతల్ల శింతపువ్వు రాలంగ
శిన్నోడ నా శెయ్యి పట్టవేమిర
ముంతా ముంతల్ల ఈతకల్లు తాగినట్టు
పానమంత నీ దిక్కె గుంజుతుందిరా
ఏగిరం లేకుండా ఇద్దరం ఇగురంగ
ఇష్టంగ ఎగిరిపోదామా
పాయిరం జంటోలే గావురం జేసుకొను
ముహూర్తబలమే అడుగుదమా
కంచె దాటంగ మంచే మీదుంగ
ముద్దుముచ్చట్ల మునిగిపోదమా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే…
బాయిలోనే బల్లి పలికే..
బాయిలోనే బల్లి పలికే..
బండసారం శిలలొదిలే బాయిలోనే
వాడకట్టు ఆడోళ్లంతా..
వాడకట్టు ఆడోళ్లంతా..
సూడమెచ్చే సంబురాలో వాడకట్టు..
చరణం 2:
సందు సందుల్ల మందీ మందీల
సైగలు జెయ్యంగ సూడవేమిర
ఎన్ని దినాలు నువ్వే పానాలు
అంటూ నిన్నే తలువనురా
పొడిపొడి మాటల పోరడ
నీకాడ జేరగ పట్టు వడితినిరా
పరులా కన్నూల పడక
నీ కొరకు పరుగు పరుగన వస్తినిరా
అలిమిన శీకట్ల బలిమిలేకుండా
ఆలుపు సొలుపులు తీర్చవేమిరా
బాయి బాయి బాయి బాయి బాయిలోనే…
బాయిలోనే బల్లి పలికే..
బాయిలోనే బల్లి పలికే..
బండసారం శిలలొదిలే బాయిలోనే
కంకపొదలా కొమ్మలిరిసి..
కంకపొదలా కొమ్మలిరిసి..
కోలాటాలాడంగో కంకపొదలా
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకుని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే……
No comments:
Post a Comment
Leave your comments