కరుణామయుడు (1978)
రచన: విజయరత్నం
సంగీతం: బి. గోపాలం
గాయకుడు: వి. రామకృష్ణ
పువ్వుల కన్నా
పున్నమి వెన్నెల కన్నా
మిన్నయైనది పసిడికుసుమం
ఎవరు? ఎవరు?
ఎవరీ సలలితగాత్రి
ఎవరో! ఎవరో!
ఇంకెవరో కాదు
పరమ పావని మరియా
ఈ కన్య మరియా...
దేవదూత గాబ్రియేలు వచ్చింది
తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది
పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై
దైవకుమారుడు నీ ఇంట వెలిసేనమ్మా
అని ఆశీస్సులొసగింది ఆ దేవత ఆ దేవత
యోసేపు మరియమ్మ నొదలాలనీ
బహు కలత చెందాడు ఆ రాతిరీ
ఆ రాతిరీ ఆ రాతిరీ
కలలో దేవుని వెలుగు కనిపించెను
ఇది దైవకార్యమని చాటి ఓదార్చెను
జనన సంఖ్యలిచ్చుటకు
అలసిసొలసి దంపతులు
నడవలేక నడిచారు
బెత్లహేమపురమునకు
నడవలేక నడిచారు
బెత్లహేమపురమునకు
దావీదుపురములో
ఆ పశులపాకలో
ఈ రోజు మీరెళ్ళి తరియించెనూ
రారాజు మీకొరకు ఉదయించెనూ
అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను
అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను
హేరోదు రాజా నమో నమో
రాజాధిరాజిక జనియించెనూ
ఆ జాడలిమ్మని జ్ఞానత్రయం
కోరగా రేగింది హాలాహలం
ఆ ప్రభుని దర్శించి రారమ్మని
హేరోదు తెలిపాడు కపటమ్ముగా
దేవుని వెలుగు జ్ఞానులకెదురై
వేరే దారుల పొమ్మంది
దూత చెప్పిన మాట మేరకు
ముగ్గురి పయనం సాగింది
ముగ్గురి పయనం సాగింది
ముగ్గురి పయనం సాగింది
యోసేపు ఓ యోసేపు
ఏళ్లు నిండని కూనలా
రెండేళ్ళు నిండని పాపలా
తలలు నరికే శాసనం
హేరోదు చేయగబూనెను
ఏసును ఎత్తుకుని
ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా
వెళ్ళి చేరవయ్యా
దేవుని కబురు వచ్చేవరకూ
అచట ఉండవయా
అచట ఉండవయా
దూత చెప్పిన మాటలు నమ్మి
బయలుదేరినారు
వారు బయలుదేరినారు
No comments:
Post a Comment
Leave your comments