చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
రచన: భువనచంద్ర
గానం: ఉన్నికృష్ణన్, చిత్ర
పల్లవి:
నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలుగనే పసిమనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ
చరణం 1:
కళ్ళు కళ్ళు మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మ ప్రేమా
నిద్దుర చెదిరిపోయేనమ్మా
నేస్తం కోసం వెతికేనమ్మ ప్రేమా
ఆడించి పాడించి
అనురాగం కురిపించీ అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ
పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమా
ప్రేమలకు హద్దు లేదులే
దాన్ని ఎవ్వరైన ఆపలేరులే
నీ పిలుపే ప్రేమగీతం
చరణం 2:
జాతీ లేదు మతమూ లేదు
కట్నాలేవి కోరుకోదు ప్రేమా
ఆది లేదు అంతం లేదు
లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో పేరేదో
కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమా
నాలోనా నీవుండి
నీలోనా నేనుండీ జీవించేదే ప్రేమా
జాతకాలు చూడబోదులే
ఎన్ని జన్మలైనా వీడిపోదులే
నీ పిలుపే ప్రేమగీతం
No comments:
Post a Comment
Leave your comments