రాంబాయి నీ మీద నాకు

రాజు వెడ్స్ రాంబాయి (2025) 
గానం: అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం
సంగీతం: సురేశ్ బొబ్బిలి 
రచన: మిట్టపల్లి సురేందర్ 

పల్లవి :  

రాజూ నువ్వెప్పుడూ 
బ్యాండు కొడుతూనే ఉండు ఆ
మనకు పెళ్లయినా 
బ్యాండు కొడుతూనే ఉండు
మనకు పిల్లలు పుట్టినా 
బ్యాండు కొడుతూనే ఉండు
మనం ముసిలోళ్ళమయిపోయినా 
బ్యాండు కొడుతూనే ఉండు
సరేనా...!

ఇంకోటి..
మనం ప్రేమించుకున్నదెవరికీ చెప్పకు 

చెప్పన్లే గానీ 
తోవమీద నీ పేరుంచాల్నా  
తుడిపెయ్యాల్నా 

తుడపకులే...
చిన్నగ రాస్కో..!

విచిత్రాల ఈ ప్రేమ 
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానమంటు 
కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టుపెట్టుకు చందమామ 
ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే 
గొడుగులాగ మారి
పూలకొమ్మలు వంగెనమ్మా

అందాల ఓ ముద్దుగుమ్మా 
గుండె గీసుకున్నదే నీ బొమ్మ
ప్రాణమల్లే నాకు తోడు వస్తే 
నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ
నువ్వంటే చచ్చేంత ప్రేమ 
అది మాటల్లో చెప్పలేనమ్మా
నీ జంట కోసం చితిమంట దాకా 
అడుగుల్లో అడుగేస్తానమ్మా

ముసిముసినవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా..
ముసిముసినవ్వుల్లో ముత్యాలు ఒలుకంగ
తొలిసారి నీ చూపు తనువార తాకంగ
పొంగిందే నాలోని పచ్చిప్రేమల గంగ

రాంబాయి నీ మీద నాకు మనసాయెనే
ఏనాడూ నిన్ను వీడిపోని నీడైతనే
రాంబాయి నీ మీద నాకు మనసాయెనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే

బొట్టుపెట్టుకు చందమామ 
ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే 
గొడుగులాగ మారి
పూలకొమ్మలు వంగెనమ్మా

విచిత్రాల ఈ ప్రేమ 
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానమంటు 
కొత్త కథలాగా మొదలైతదమ్మా

చరణం :

రాజ్యమేది లేదుగాని 
రాణిలాగా చూసుకుంటా
కోటకట్టలేను గాని 
కళ్ళలో నిన్నే దాచుకుంటా
రాత ఎట్లా రాసి ఉన్నా 
మార్చి నీతో రాసుకుంటా
స్వర్గమంటూ ఉన్నదంటే 
అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా

నిన్నుగన్న మీ నాన్నకన్నా 
అల్లారుముద్దుగా సాదుకుంటా
నీకు కోపం వస్తే కొంత దూరముంటా 
నువ్వు గీత గీస్తే నేను దాటనంటా
కంట నీరు కంటి రెప్ప దాటకుండ 
కాటుకై కావాలంటా..

రాంబాయి నీ మీద నాకు మనసాయెనే
ఏనాడూ నిన్ను వీడిపోని నీడైతనే

ఓ రాజూ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నను వీడిపోని నీడైతివిరా

రాంబాయి నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే

విచిత్రాల ఈ ప్రేమ 
ఏ అంతరాలు ఎంచదమ్మా
మనసొక్కటే జన్మస్థానమంటు 
కొత్త కథలాగా మొదలైతదమ్మా
బొట్టుపెట్టుకు చందమామ 
ఈ నేల మీద పుట్టెనమ్మా
అడుగు మోపుతుంటే 
గొడుగులాగ మారి
పూలకొమ్మలు వంగెనమ్మా

No comments:

Post a Comment

Leave your comments