చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
రచన: భువనచంద్ర
గానం: వందేమాతరం శ్రీనివాస్
పల్లవి:
దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
దిగులుపడకురా సహోదరా
దిగులుపడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
దిగులుపడకురా సహోదరా...
యమ్మా యమ్మా ..
యమ్మా యమ్మ
చినదాన్ని చూడ్లేదమ్మా
వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమే కదమ్మా
దిగులుపడకురా సహోదరా
చరణం 1:
గాంధీ స్టాచ్యూ పక్కన చూసిన ప్రేమ వేరురా
జగదాంబ ధియేటర్లో చూసిన ప్రేమ వేరురా
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
వి.ఐ.పి కి ప్రేమవస్తే హోటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే...ఎ ఎ ఎ ఎ ఎ ఓహొ..
నేనాటో ఎక్కి తిరుగుతుంటే లవ్లోపడ్డ జంటరా
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా
సహోదరా సహోదరా సహోదరా
దిగులుపడకురా
చరణం 2:
లిఫ్టు అడిగి వచ్చే ప్రేమ షిఫ్టు మారిపోయెరా
చీరలిచ్చి కొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా
ఆఫీసులో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా
మరో ప్రేమ బస్టాపులో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే...ఓ ఓ ఓ ఓ అహా!
నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టే కాలంరా
ఊరు మొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా
కళ్ళతో నే చూసిన ప్రేమకధలు వేరురా
ఉన్నతమైన ప్రేమ నీదేరా సోదరా
సహోదరా సహోదరా సహోదరా
దిగులుపడకురా సహోదరా
No comments:
Post a Comment
Leave your comments