దావీదు తనయా హోసన్నా

కరుణామయుడు (1978)
గానం: ఆనంద్, విల్సన్,యల్. ఆర్.అంజలి 
రచన: విజయరత్నం
సంగీతం: బి. గోపాలం

అయ్య.. 
దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా 
దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా
హోసన్నా హోసన్నా 
యేసన్నా యేసన్నా

దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా 

గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా
హోసన్నా హోసన్నా
యేసన్నా యేసన్నా
పిల్లలు పెద్దలు జగమంతా
నీకై వేచెను బ్రతుకంతా

కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచరవాహన నీ పయనాలు 
హోసన్నా హోసన్నా
యేసన్నా యేసన్నా
కంచరవాహన నీ పయనాలు 
జనావాహినికే సుబోధకాలు

పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – 
యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా 
పరిచితిమివిగో మా హృదయాలు

No comments:

Post a Comment

Leave your comments