రాజు వెడ్స్ రాంబాయి (2025)
గానం: చిన్మయి శ్రీపాద
సంగీతం: సురేశ్ బొబ్బిలి
రచన: మిట్టపల్లి సురేందర్
పల్లవి :
ఆ మేఘం వీడివస్తున్న
వానచినుకులనీ
ఓ క్షణమైన ఆపగలదా
నింగీ ఆగమని
తేనెకంటె తీయంగా
అడవికంటే అందంగా
కోయిలమ్మ పాడేటి
పాటనాపగలదా అడవి
పూలలో పుడుతూనే
గాలిలో కలిసేటి
పరిమళం తనలోనే
దాచుకోగలదా తోట...?
నువ్వు అలా అలా
నువ్వు-నేను ఒక్కటయ్యే రోజే వస్తే
నిన్ను నన్ను ఆపే అంత బలం
దేవుళ్ళకైనా లేదంట..
అలా అలా
నువ్వు-నేను ఒక్కటయ్యే రోజే వస్తే
నిన్ను నన్ను ఆపే అంత బలం
దేవుళ్ళకైనా లేదంట..
చరణం 1:
ఓ…
చీకటిని దాటివచ్చే
వెలుతురును ఎపుడైనా
వెళ్లకనీ ఆగమనీ
అడ్డుకుంటుందా రాతిరి
కల యెంత బాగున్నా
కన్నది మన కనులైనా
ఆపుకుంటూ నచ్చినట్టు
చూడగలమా మళ్లీ కలని
ఏ మనసుని
ఏ సమయమున
ఎంచుకుంటుందో ఈ ప్రేమ
ఏ జంటకీ తెలుసుకోవడం
సాధ్యం కాదమ్మా
ఓ అలా అలా
నువ్వు-నేను ఒక్కటయ్యే రోజే వస్తే
నిన్ను నన్ను ఆపే అంత బలం
దేవుళ్ళకైనా లేదంట..
No comments:
Post a Comment
Leave your comments