చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
రచన: భువనచంద్ర
గానం: బాలు, అనురాధా శ్రీరామ్
పల్లవి :
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా
చరణం 1:
వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే
ప్రియా నిను చూడలేక
చరణం 2:
కోవెలలో కోరితినీ నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన అందించరాదా
నినుగాక లేఖలని పెదవంటుకోనా
వలపులు నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే
ప్రియా నిను చూడలేక
No comments:
Post a Comment
Leave your comments