November 15, 2024

హాయిహాయిగా ఆమని సాగే

చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: ఘంటసాల, జిక్కి  

పల్లవి :

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే
హాయిహాయిగా ఆమని సాగే
సోయగాల గన ఓయి సఖా.. 
హాయి సఖా.. ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే

లీలగా పువులు గాలికి ఊగా ఆ.. ఆ.. ఆ...
లీలగా పువులు గాలికి ఊగా ఆ ఆ ఆ.....
లీలగా పువులు గాలికి ఊగా
సనిదమ దనిసా 
గమ గమ దనిసా
రిసనిద సరిసని దనిని దనిని 
దని మగద మగద మద గరిగ మదని
లీలగా పువులు గాలికి ఊగా
కలిగిన తలపుల వలపులు రేగా
కలిగిన తలపుల వలపులు రేగా
ఊగిపోవు మది ఉయ్యాలగా..ఆ ఆ ఆ..  
జంపాలగా ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే

చరణం 1 :

ఏమో... ఏమో తటిల్లతికమే మెరుపు
ఏమో తటిల్లతికమే మెరుపు మైమరపేమో
మొయిలురాజు దరి మురిసినదేమో.. 
మైమరపేమో
మొయిలురాజు దరి మురిసినదేమో

వలపు కౌగిలుల వాలి సోలి... 
వలపు కౌగిలుల వాలి సోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా...  
జంపాలగా ఆ ఆ ఆ
హాయిహాయిగా ఆమని సాగే 

చరణం 2 :

ఆ ఆ ఆ ఆ 
చూడుమా చందమామ.. 
అటుచూడుమా చందమామ
కనుమా వయ్యారి శారదయామిని 
కవ్వించే ప్రేమ...
ఆ ఆ ఆ.. 
చూడుమా చందమామ
వగలా తూలే విరహిణులా
వగలా తూలే విరహిణులా
మనసున మోహము రేపు నగవులా
మనసున మోహము రేపు నగవులా

ఊగిపోవు మది ఉయ్యాలగా 
జంపాలగా.. ఆ.. ఆ.. ఆ
హాయిహాయిగా ఆమని సాగే 

చరణం 3 :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
కనుగనా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా..... 
కనుగనా తనియగా ప్రియతమా
కలువలు విరిసెనుగా ఆ ఆ ఆ 
కనుగనా తనియగా

చెలువము కనుగొనా..ఆ.. ఆ.. 
చెలువము కనుగొనా
మనసానందనాట్యాలు సేయునోయీ
ఆనందనాట్యాలు సేయునోయీ

సరిగమదనిసా దనిసా 
సనిసగరిగా సరిసని
దనిమదనిస నిరినిరి దనిదని 
మదమద గమగమ గమ
దనిసా గమ దనిసా దనిసా