చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ధి సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
పల్లవి :
ఏరా! -
ఏరా మనతోటి గెల్చే -
ధీరులెవ్వరురా! రణశూరులెవ్వరురా!
భళా భళి:
కోరస్: "ఏరా మనతోటి"
అద్దిరభన్న - గుద్దుల బెల్లం -
గభిగుభిగభిగుభి వీపుకు సున్నం
దుబ్ దుబ్ దుబ్ దూదేకుడూ -
ఆ దెబ్బతో తోక పీకుడూ
చరణం 1:
అరె ఆంజనేయుడికి అన్నదమ్ములం -
భీమసేనుడికి పెద్ద కొడుకులం
కోరస్: అద్దిరభన్నా
లోభుల నెత్తిని మొట్టేవాళ్ళం
లోకులకెప్పుడు పెట్టేవాళ్ళం
కోరస్: అద్దిరభన్నా
ఈ సీమకి మేమే రాజులం
ఆహా తిండికి పోతురాజులం
అరె సాగితే మహారాజులం
అరె చతికిలబడితే తరాజులం
కోరస్: అరె చతికిలబడితే తరాజులం
"ఏరా మనతోటి"
చరణం 2:
పిన్నా పెద్దా - బేధం లేదూ
కొద్దీ గొప్పా తేడాలేదు
కోరస్: అద్దిరభన్నా
జుట్టూ జుట్టూ ముడిపెడతాం -
చెవులకు తాటాకులు కడతాం
కోరస్: అద్దిరభన్నా
మా సొంతమన్నదే లేదు - లేదు
చుప్పనాతులం గాదు - గాదు
ఎప్పుడు కోపం రాదు - రాదు
అది వచ్చిందంటే పోదూ
కోరస్: అది వచ్చిందంటే పోదూ
"ఏరా మనతోటి"
చరణం 3:
మీసం జూడు -
రోసం జూడూ -
పక్కనున్న సావాసం జూడు
కోరస్: అద్దిరభన్నా
సయ్యని ఎవ్వడు ముందుకు రాడు
వచ్చాడంటే ఇంటికి పోడు
కోరస్: అద్దిరభన్నా
ఈ బాటకు సుంకం కట్టు -
మా కాళ్ళకు దణ్ణంపెట్టు
అరె చిక్కెర చేతిలో జుట్టు ఇక -
తిరగెయ్‌రా పెసరట్టు ట్టు ట్టు
కోరస్: ఇక తిరగెయ్‌రా పెసరట్టు
అద్దిరభన్న - గుద్దుల బెల్లం -
గభిగుభిగభిగుభి వీపుకు సున్నం
దుబ్ దుబ్ దుబ్ దూదేకుడూ -
ఆ దెబ్బతో తోకపీకుడు
కోరస్: ఆ దెబ్బతో తోకపీకుడూ
"ఏరా మనతోటి"