చిత్రం: అవే కళ్ళు (1967)
సంగీతం: వేదా
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
హేయ్.. యు...
ఎవరు నీ వారో
తెలుసుకోలేవు
ఎవరు నీ వారో
తెలుసుకోలేవు
తాగలేదు ఊగలేదు
అంతలో ఎంత నిషా
నన్నే మరిచావో
చరణం 1:
వలపుల చిలకా
ఎందుకె అలకా
కనులలో కలహం
మనసున విరహం
మధువులు తొణికే పెదవుల దానా
పెదవుల మధువులు నావనుకోనా
చరణం 2:
మిస మిస వయసూ
మరిమరి రాదు
దొరికిన సుఖము
విడుచుట తగదు
నిన్న లేదు
రేపు రాదు
నేడే నీదే లేవే
కులుకుల నడకల
చెలియా...రావే..