చిత్రం: మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు
పల్లవి :
రింజిం రింజిం హైదరబాద్ . .
రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే
మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్ . .
రిక్షావాలా జిందాబాద్
చరణం 1 :
అటు చూస్తే చార్‌మినారు..
ఇటు చూస్తే జుమ్మా మసీదు
అటు చూస్తే చార్‌మినారు..
ఇటు చూస్తే జుమ్మా మసీదు
ఆ వంకా అసెంబ్లి హాలు..
ఈ వంకా జూబిలి హాలూ
తళ తళ మెరిసే..
తళ తళ మెరిసే హుస్సేనుసాగరు..
దాటితే సికింద్రబాదూ
రింజిం రింజిం హైదరబాద్..
రిక్షావాలా జిందాబాద్
చరణం 2 :
ఒక తలపై రూమీ టోపీ . .
ఒక తలపై గాంధీ టోపీ
ఒక తలపై రూమీ టోపీ . .
ఒక తలపై గాంధీ టోపీ
క్యా భాయి అని అంటాడొకడూ . .
ఏమోయ్ అని అంటాడొకడూ
మతాలు భాషలూ వేరైనా . .
మతాలు భాషలూ వేరైనా . .
మనమంతా భాయీ భాయీ
రింజిం రింజిం హైదరబాద్ . .
రిక్షావాలా జిందాబాద్
చరణం 3 :
ఉన్నవాడికి తింటే అరగదు . .
లేనివాడికి తిండే దొరకదు
ఉన్నవాడికి తింటే అరగదు . .
లేనివాడికి తిండే దొరకదు
పరుపులున్నా పట్టదు నిదర . .
కరుకునేలను గురకలు వినరా
హెచ్చు తగ్గులు తొలిగే రోజూ . .
హెచ్చు తగ్గులు తొలిగే రోజూ . .
ఎపుడొస్తుందో ఏమో
రింజిం రింజిం హైదరబాద్ . .