November 3, 2024

శివ గోవింద గోవింద

చిత్రం: వెలుగు నీడలు (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ 

పల్లవి : 

శివ గోవింద గోవింద
హరి గోవింద గోవింద 

సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు 
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టిపాపను తెచ్చి పెంచుకుంటారు
సంతు కలిగిందంటే చిట్టిపాపాయి గతి
శ్రీమతే రామానుజాయన్నమా
||శివ గోవింద||

చరణం 1:

తమ బాగు కోసమై తంటాలు పడలేరు
ఎదుటి కొంపకు ఎసరు పెడతారయా
పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి
శ్రీమతే రామానుజాయన్నమా
||శివ గోవింద||

చరణం 2:

పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు 
పొరుల కోసం త్యాగమొనరించు వారొకరు
పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
శ్రీమద్రమారమణగోవిందో
||హరి గోవింద||

చరణం 3:

కలిమి లేనన్నాళ్ళు కలిసి మెలిసుంటారు
కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
కలిమి పెంచే కాయ కష్టజీవుల పని
శ్రీమతే రామానుజాయన్న మా
||శివ గోవింద||

చరణం 4:

ఆనాడు శ్రీ యోగివీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా 
ఆనాడు శ్రీ యోగివీరబ్రహ్మం గారు
కాలజ్ఞానము బోధ చేశారయా 
ఈనాడు కొడసరి వెంగళప్ప మాట
అక్షరాలా జరిగి తీరేనయా
||శివ గోవింద||