చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావ్
రచన: సముద్రాల
గానం: లీల, కోరస్
పల్లవి :
ఓ....
బంగారు వన్నెల రంగారు సంజా -
రంగేళి ఏతెంచెనే - నా రాజా
చెంగూన రాడాయెనే
"బంగారు వన్నెల"
చరణం 1:
ఎలపొద్దూ గనీ తొలిముద్దూ గొనీ...
ఓఓఓ
ఎలపొద్దూ గనీ తొలిముద్దూ గొనీ ....
చనే వస్తానని ఠీవిగా - నా రాజా
రాడే ననూ చేరగా
ఓ చెలియా - రాడేమో ఈ చాయగా
"బంగారు వన్నెల"
చరణం 2:
జతజేరే తొలీ వెతదీరే చెలీ -
ఓఓఓ
జతజేరే తొలీ వెతదీరే చెలీ -
ఎలా సూరేడటూ డాయగా -
నా రాజా జారే మటుమాయగా
ఆ మనసూ మారేనేమో రాయగా
ఓఓఓ
"బంగారు వన్నెల"
చరణం 3:
సొగసెంచీ మరీ సిగనుంచీ విరీ -
ఓఓఓ
సొగసెంచీ మరీ సిగనుంచీ విరీ -
వగ ముంచీ గిరి గీసెనూ
నా రాజా ఏ గారడో జేసెనూ
ఓ చెలియా రాగాలు దోచేసెనూ
ఓ....
"బంగారు వన్నెల"