చిత్రం: వెలుగు నీడలు (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ది, ఘంటసాల
సాకీ :
కర్నూలు ఎక్కడా?
కాకినాడెక్కడ?
ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడా?
వరంగల్లు ఎక్కడా?
స్టాప్...! రైల్వే గైడ్ చూడరా గురూ
శిష్యా...! శాంతి...! శాంతి...!
వాడవాడలనుండి వాలాము ఇక్కడ
లక్కా-బంగారంలా అతుక్కుపోయామురా
మై డియర్
హహ్హహ్హహ్హ...
ఆహాఁ
కరక్ట్ ...
పల్లవి :
బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే
స్తూడెంట్ లైఫే సౌఖ్యములే
చీకు చింతకు దూరములే
బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే
చరణం 1:
పంపునీళ్ళు బందయితే స్నానానికి నోచుకోము
గుయ్యిమని దోమలు దాడిచేస్తే
శివరాత్రి జాగరణ చేస్తాము
ఉప్పూకారం లేని హోటల్ సాపాటుతో
చప్పబడిపోయామురా బ్రదర్
హా... ఎన్ని కష్టాలురా నా తండ్రీ ...!
భయపడకురా పుత్రా
కష్టాలను దిగమింగేస్తాం
కలకల నవ్వుతు గడిపేస్తాం
కష్టాలను దిగమింగేస్తాం
కలకల నవ్వుతు గడిపేస్తాం
బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే
చరణం 2:
ఇంటికి పోతే "పెళ్ళి పెళ్ళి" అని వెంటపడతారు పెద్దలు
పెళ్ళిచేసుకుంటే "మేమూ మేమూ" అని పుట్టుకొస్తారు పిన్నలు
ఈ జంఝాటంతో విద్యానాశాయ సర్వంనాశాయ
నమో నమోరా బ్రదర్...
హా హతవిధీ . ..!
సహనం సహనం
ఉపాయముంది నాయనా
పెళ్ళికి బకాయి పెట్టేస్తాం
బాధ్యతలన్నీ నెట్టేస్తాం
పెళ్ళికి బకాయి పెట్టేస్తాం
బాధ్యతలన్నీ నెట్టేస్తాం
బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే
చరణం 3:
బాధ్యతల నెన్నడూ మరచిపోరాదు
ప్రగతి మార్గము నెపుడూ వదలిపోరాదు
క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా బ్రదర్...
"హియర్...! హియర్..!"
ఆదర్శంగా నడవాలి
అందరు భేషని పొగడాలి
ఆదర్శంగా నడవాలి
అందరు భేషని పొగడాలి
బలే బలే మంచి రోజులులే...