జిల్లెళ్ళమూడి అమ్మ (1975)
రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి
గానం: సుశీల
పల్లవి :
దీపావళి దివ్య దీపావళీ
దీపావళి దివ్య దీపావళి
ఇది మాపాలి ఆనంద భావావళీ
దీపావళి దివ్య దీపావళి
చరణం 1:
ప్రమిదయె ఇలనున్న ప్రతి దేహియూ
ప్రేమించు భావమే అందలి నూనె
ప్రమిదయె ఇలనున్న ప్రతి దేహియూ
ప్రేమించు భావమే అందలి నూనె
వత్తియే జీవిగ వరలగ అన్నిటా
వత్తియే జీవిగ వరలగ అన్నిటా
వెలిగే జ్యోతివి నీవేనమ్మా...
దీపావళి దివ్య దీపావళి
ఇది మాపాలి ఆనంద భావావళీ
దీపావళి దివ్య దీపావళి
చరణం 2:
పతితుడు సజ్జనుడొకటేననీ
పాపము పుణ్యము భువిలేవనీ
అఖిలము నీవై అమ్మవు మాకై
అఖిలము నీవై అమ్మవు మాకై
సుగతికి దారిని చూపే తల్లీ
దీపావళి దివ్య దీపావళి
చరణం 3:
అలరెడు నీ చిరుహాస రేఖలు
తొలగించును మా చీకటి తెరలు
అలరెడు నీ చిరుహాస రేఖలు
తొలగించును మా చీకటి తెరలు
కురియగ నీ కరుణామృత ధారలు
కురియగ నీ కరుణామృత ధారలు
పరవశించు మది మురిసిపోవఁగా