చిత్రం: సువర్ణ సుందరి (1957)
సంగీతం: ఆదినారాయణరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపథ్యగానం: సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా...
అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా...
అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం 1 :
మనసున బాళి మరువనులేర...
చలమున మోడి సలుపకు రాజా....
సమయము కాదుర నిను దరిచేర..
సమయము కాదుర నిను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలువకురా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
చరణం 2 :
ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగానీ..
ఓ యనలేనురా కదలగలేరా..
ఓ యనలేనురా కదలగలేరా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలువకురా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ