November 13, 2024

జీవితమే ఓ పూబాట

చిత్రం: పసిడి మనసులు (1970)
సంగీతం: అశ్వత్ధామ
రచన: ఉషః శ్రీ
నేపథ్యగానం: ఘంటసాల

పల్లవి :

జీవితమే ఓ పూబాట
ఆడుకో సయ్యాట
మగువ సరసనా 
మధువు బిగువునా 
తనివిని నీవొందుమా 

November 7, 2024

వెయ్ వెయ్ తకధిమి

చిత్రం: ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: కమల్‌హాసన్ బృందం

పల్లవి :  

రాధా.. 
ఎందుకింత బాధా..!

వెయ్ వెయ్ తకధిమి 
చెయ్ చెయ్ కథకళి
టక్కుముక్కూ తాళంవేయ్.. 
వెయ్ వెయ్

ముయ్ ముయ్ తలుపులు 
వెయ్ వెయ్ దరువులు
లక్కుముక్కూ గొళ్ళెమెయ్..  
వెయ్ వెయ్...
వాటం చూస్తే ఘుమఘుమా..
వర్ణం చూస్తే సరిగమా
వాటం చూస్తే ఘుమఘుమా..
వర్ణం చూస్తే సరిగమా

వెయ్ వెయ్ తకధిమి... 

అహ్హా...
నోర్మూయ్..
హై హై
ముయ్యకపోతే...
వంకాయ్..
హై హై

ఆడువారి మాటలు

ఆడువారి మాటలు 
ఇంటిగుట్టు (1958)
రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి 
సంగీతం: ఎమ్మెస్ ప్రకాశ్
గానం: ఏ.ఎమ్. రాజా

పల్లవి :  

ఆడువారీ మాటలు
రాక్అన్‌రోల్ పాటలు 
ఆడువారి కోపాలు 
మాపైన పన్నీటిజల్లులు 

ఆడువారీ మాటలు
రాక్ అన్ రోల్ పాటలు 
ఆడువారి కోపాలు 
మాపైన పన్నీటిజల్లులు 

డియోడిడిడీడీ  
డియోడిడిడీడీ
డియోడిడిడీడీ

November 4, 2024

గుసగుసలే గున్నామామిళ్ళో

చిత్రం: అన్నయ్య (2000)
సంగీతం: మణిశర్మ 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత  
రచన: వేటూరి 

పల్లవి : 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

చిటికెడులే చిరుముద్దుల్లో 
అన్నీ పిడికెడులే పిల్లా సిగ్గుల్లో

యా యా సౌందర్య 
ఇది నిజమా యాయా

అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా

ఎదకొరిగి ఎన్నో బింకాలా
రుచిమరిగీ ఇంకా ఇంకాలా

హొయ్ చెమటలతో చెంగే పంఖాలా
హొయ్ సుఖపడుతూ కట్టే సుంకాలా 

గుసగుసలే గున్నామావిళ్ళో  
అన్నీ రుసరుసలే కన్నెచూపుల్లో

November 3, 2024

దీపావళి దివ్య దీపావళి

జిల్లెళ్ళమూడి అమ్మ (1975)
రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య 
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి
గానం: సుశీల 

పల్లవి :  

దీపావళి దివ్య దీపావళీ
దీపావళి దివ్య దీపావళి
ఇది మాపాలి ఆనంద భావావళీ 
దీపావళి దివ్య దీపావళి

దీపావళీ దీపావళి

చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల 
గానం: జిక్కి, రావు బాలసరస్వతి

పల్లవి :  

దీపావళీ దీపావళి 
దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళీ
ఇంటింట ఆనంద దీపావళీ
మా ఇంట మాణిక్య కళికావళి
మా ఇంట మాణిక్య కళికావళీ
దీపావళీ దీపావళి 
దీపావళీ దీపావళి

శివ గోవింద గోవింద

చిత్రం: వెలుగు నీడలు (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ది సత్యం, ఉడుత సరోజినీ 

పల్లవి : 

శివ గోవింద గోవింద
హరి గోవింద గోవింద 

సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు 
సంతానమే లేక స్వర్గమే లేదని
చిట్టిపాపను తెచ్చి పెంచుకుంటారు
సంతు కలిగిందంటే చిట్టిపాపాయి గతి
శ్రీమతే రామానుజాయన్నమా
||శివ గోవింద||

రింజిం రింజిం హైదరబాద్

చిత్రం: మట్టిలో మాణిక్యం (1971)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు  

పల్లవి :

రింజిం రింజిం హైదరబాద్ . . 
రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే 
మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్ . . 
రిక్షావాలా జిందాబాద్ 

బలే బలే మంచి రోజులులే

చిత్రం: వెలుగు నీడలు (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: కొసరాజు
నేపథ్యగానం: మాధవపెద్ది, ఘంటసాల

సాకీ :  

కర్నూలు ఎక్కడా?
కాకినాడెక్కడ? 
ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడా?
వరంగల్లు ఎక్కడా?
స్టాప్...! రైల్వే గైడ్ చూడరా గురూ 
శిష్యా...! శాంతి...! శాంతి...!
వాడవాడలనుండి వాలాము ఇక్కడ 
లక్కా-బంగారంలా అతుక్కుపోయామురా 
మై డియర్ 
హహ్హహ్హహ్హ...
ఆహాఁ 
కరక్ట్ ...

పల్లవి :  

బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే 
స్తూడెంట్ లైఫే సౌఖ్యములే 
చీకు చింతకు దూరములే 

బలే బలే మంచి రోజులులే
మళ్ళీ మళ్ళీ ఇక రావులే