చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: శివ గణేష్
గానం: మనో, సుజాత
సాకీ:
మేనత్త కూతురివే
మెరుపంటి మరదలివే
మదిలోన మరులొలికే
మరుమల్లె జాతరవే
పొట్టిజెళ్ళ పాలపిట్ట
పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పున్నమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగేదెట్టా..ఆ
పల్లవి:
రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారుపైట వేసుకున్న జానపదమా..
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపెంచే
రాగాలసిలకా రంగేళిమొలకా
రాయంచ నడకా రావాకు తళుకా