ఛాంపియన్ (2025)
రచన: కాసర్ల శ్యామ్
సంగీతం: మిక్కీ జే మేయర్
గానం: రామ్ మిరియాల
పల్లవి:
ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే..
పచ్చాని సీరకట్టి పంటచేనే మురిసిందే..
పరదాలే తీసేద్దాం..
దిగి దిగి తాం దిత్తాం దిత్తాం
ఏ మబ్బు ఎనుక
ఏ సినుకు ఉందో..
ఏడా రాలునో..
ఏ తొవ్వలోన
ఏ మలుపు ఉందో..
ఏడా ఆగునో సాగునో..
ఏ ఎండల్లో దాగి ఏడురంగుల్లో
ఆ హరివిల్లే పుట్టును కదా
ముల్లైనా పూలైనా కొమ్మకు పూసె కదా
గిర గిర గిర గింగిరాగిరే
సర సర సర బొంగరాలివే
జర జర జర సుట్టు తిరిగెలే
అందాల భూమి-సూర్యునిలా
గిర గిర గిర గింగిరాగిరే
తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టలే
చర చర చర ఎగిరిపోవులే
రయ్యంటూ రాయీ-వడిసెల్లా
ఎర్రెర్ర బొట్టు దిద్ది వెండి మేఘం మెరిసిందే..
పచ్చాని సీరకట్టి పంటచేనే మురిసిందే..
పరదాలే తీసేద్దాం..
దిగి దిగి తాం దిత్తాం దిత్తాం
చరణం 1:
పల్లే.. తల్లిలా కొంగునే సాపినాదే
ఒళ్ళో.. గువ్వలా దాచినాదే
ఊరే.. స్నేహమే ఊరిన ఊట సెలమాయే
చుట్టు పక్క ఏ గోడలు అడ్డే లేని ఈ వాడలు
ముద్ధుగున్నాయే హత్తుకున్నాయే
మనసుతోనే అందరు సొంతమనే
గిర గిర గిర గింగిరాగిరే
చరణం 2:
రాలే.. సుక్కలే గాజుల సప్పుడాయే
లేనీ.. హాయిలో ముంచినాయే
దూరం చూడగా దారిలో దగ్గరైపోయే
చల్లారని సంతోషం తెల్లారక ఉండాలని
పంచుకున్నాయే పెంచుకున్నాయే
తెలవకనే తెలిసిన చుట్టంలా
గిర గిర గిర గింగిరాగిరే
No comments:
Post a Comment
Leave your comments