చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: వందేమాతరం శ్రీనివాస్, యస్.జానకి
పల్లవి :
బండెనక బండి కట్టీ...
పదహారు బళ్ళు కట్టీ...
మెట్టినింటి దారే పట్టే...
పుట్టినింటి ముద్దూపట్టీ...
ఎడ్లబండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
ఎడ్లబండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
బండెనక బండి కట్టీ...
పదహారు బళ్ళు కట్టీ...
మెట్టినింటి దారే పట్టే...
పుట్టినింటి ముద్దూపట్టీ...
ఎడ్లబండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా
సారె సీరె తీసుకోని సాగిపోయెనమ్మా
సాగలేని పిల్ల మనసు ముగబోయెనమ్మా
చరణం 1:
మనసే ఊయలగా ఊగెను ఈ చెల్లి
ఎండే వెన్నెలగా మార్చినది నా తల్లి
నువ్వే ప్రాణమని నీ నవ్వే లోకమని
తలచే అన్ననిలా విడిచీ వెళ్ళేవా
ఊరు బోరుమంటుంది నీ తోడు లేక
గుండె బావురంటుంది నిను వీడలేక
ఎడ్లబండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
చరణం 2:
అన్నా ఎల్లిరానా వదినా ఎల్లిరానా
ఊరా ఎల్లిరానా సెలయేరా ఎల్లిరానా
రెప్పకు కనుపాప చెప్పే వీడ్కోలు
చెల్లే అన్నకిలా చెబుతుంది ఈనాడు
మగాళ్లకెన్నటికీ పుట్టెనిల్లే లోకం
మగువలు పుట్టింది మెట్టెనింటి కోసం
ఎడ్లబండి ఏరు ఊరు దాటి సాగెనమ్మా
No comments:
Post a Comment
Leave your comments