ఇదేమిటమ్మా మాయ మాయ

ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం: కుమార్ సాను, రష్మి 
రచన: చిన్ని చరణ్   

పల్లవి: 

ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా...?

ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా..?

ఆ ఇంద్రలోకం నిన్నూ నన్నూ 
ఏకం కమ్మందా...?

ముత్యమా ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా

ఓ వింత కవ్వింత నీకంత చొరవ

ప్రియతమా ప్రియతమా
ఈ హాయి తొలిప్రేమ ఫలితమా

పరువమా ప్రణయమా
నీ చెలిమిలో తీపి మధురిమా

ఓ ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా

ఆ ఇంద్రలోకం నిన్నూ నన్నూ 
ఏకం కమ్మందా

చరణం 1:

శ్రీరంగా
నిను కోరంగా
ఈ గిలిగింతలూ 
చలిలో చెమటలూ

గారంగా 
నువ్వు చేరంగా
మదిలో మెరుపులు
ఎదలో పరుగులు

దాయి దాయి దాయి దామ్మా
దరె దాయి దాయి దాయి దామ్మా
పాపలయ్యి పాడుకుందమా
చేపలల్లే ఈదుకుందమా

గుండె బావి తోడుకుందమా
ఈడు దాహం తీర్చుకుందమా

నీళ్లలోనే మనముంటున్నా 
తీరని దాహాలేంటమ్మా

ఓ ఇదేమిటమ్మా 

చరణం 2:

వేసవిలో.. 
నిను చూస్తుంటే
చలి వేస్తున్నది.. 
చెలి ఏంటే ఇదీ

వేకువలో.. 
నువ్వు లేకుంటే
వెలుగే అలుగుతూ.. 
రానంటున్నదీ

దాయి దాయి దాయి దామ్మా
దరె దాయి దాయి దాయి దామ్మా
తాజ్ మెహల్ చేరుకుందమా
లవ్ గజల్ పాడుకుందమా

తారలన్నీ తెంచుకుందమా
తోరణాలే కట్టుకుందమా

ఓ చంద్రమండల వీధుల్లోనా 
చెలియా మీటే అవుదామా

ఇదేమిటమ్మా 

No comments:

Post a Comment

Leave your comments