చిత్రం: పల్నాటి పౌరుషం (1994)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: బాలు, శోభా శంకర్
పల్లవి :
మాగాణి గట్టుమీద
రాగాల పాలపిట్టరో
ఉయ్యాల పాటతోటి
ఊరంతా గోలపెట్టెరో
అన్నయ్య ప్రాణమైన చెల్లికి
అల్లా పున్నాగపువ్వులాంటి పిల్లటా
ముక్కుపుడకా
చిట్టికమ్మెలూ
పట్టెగొలుసే పెట్టాలనీ
మేళాలెట్టీ
తాళాలెట్టీ
మేనమామే బయలుదేరెను
మాగాణి గట్టుమీద
చరణం 1:
కోడిపుంజు రోషము
కోరచూపు మీసము
కోడలమ్మ ఉయ్యాలే ఊపాలా
జమిలిపిట్ట కళ్ళటా
తమలపాకు ఒళ్ళట
తళుక్కుబొమ్మ తల్లి పోలికేనటా
ఆ చెల్లెమ్మ ముద్దురూపం
ఈ అన్నయ్య గుండెదీపం
అందుకే వియ్యపోళ్ల ఇంటికి పయనాలట
అత్తకూతురి మీదే అల్లుడికి ఆశట
మాగాణి గట్టుమీద
చరణం 2:
బంధువుల ఇంటికీ
విందుభోజనాలకీ
చందమామ పిల్లకీ
చక్కనాల తల్లికీ
తెల్లావుతోటి వచ్చే అల్లుణ్ణే చూడాలయ్యో
ఓయబ్బో అల్లుడా ఎంత ముందుచూపురా
తల్లిపాలు చాలవనే యోచనెట్టా వచ్చెరా
పచ్చిబాలింతరాలు బావా నొచ్చకుండ చూస్తాలే
అందాల మా బావ బంగారుకొండేనట
కిల్లాడి నా బావ పిల్లనడగ వచ్చేనట
మాగాణి గట్టుమీద
రాగాల పాలపిట్టరో
ఉయ్యాల పాటతోటి
ఊరంతా గోలపెట్టెరో
బావామరుదులు తిరిగే వాకిలి
ఆహా పాడిపంటలై పొంగే లోగిలీ
ఎల్లకాలం చల్లగుంటే కళ్ళనిండా పండగేగా
గుండెనిండా ప్రేమలుంటే దేవుడుండే కోవెలేగా
మాగాణి గట్టుమీద
No comments:
Post a Comment
Leave your comments