అనగనగా ఓ అమ్మాయి (1999)
సంగీతం: మణిశర్మ
రచన: సామవేదం షణ్ముఖశర్మ
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
పల్లవి :
స్వాతిచినుకా
సందె తళుకా
నచ్చే నాజూకా
సాహో చందమామ తునకా
రావే కౌగిలింటి దాకా
చందమామ తునకా
రావే కౌగిలింటి దాకా
ఇంత చురుకా
వింత ఉరుకా
ప్రేమే పుట్టాకా
అబ్బో ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
ఆగడాల దుడుకా
అల్లే అల్లరింటి కొడుకా
చేరుకో నన్నే తారకా....
కోరుకోలేవే కోరికా.....
నేరుగా వచ్చేసాక
మోమాటమేముంది
ముద్దాడవే గోపిక
స్వాతిచినుకా