September 22, 2025

కొమ్మ రెమ్మ పూసే రోజు

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: బాలు, చిత్ర

పల్లవి :

కు కు కు కు కూ..ఊ..
కొమ్మ రెమ్మ పూసే రోజు....

కు కు కు కు కూ..ఊ..
ప్రేమ ప్రేమ పుట్టినరోజు

నిదురించే ఎదవీణ కదిలేవేళలో...

మామిడి పూతల మన్మధకోయిల...

కు కు కు కు కూ..ఊ.
కొమ్మ రెమ్మ పూసే రోజు

చరణం 1 :

స్వరాలే...
వలపు వరాలై...
చిలిపి శరాలై...
పెదవి కాటేయగా..

చలించే... 

స్వరాలే

వలచి వరించే ... 

వయసు వరాలే..

ఎదలు హరించే ... 

చిలిపి శరాలై...

కలలు పండించగా

గున్నమావి గుబురులో 
కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై 
పల్లవించవమ్మ

మూగబాసలే... 

ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై... విరియగ...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా.. పదసని 
నీ...గసరిద 
ద...సనిదమ
మా... నిదమగ 
గ...గమగమ దని....
సా...గెదెపుడు 
నీ పెదవుల 
ద... దారి విడిచి
మా..మార్గశిరపు 
గా..గాలులు మురళిగ...
విన్న వేళ కన్నె రాధ పులకించే...

కు కు కు కు కూ..

చరణం 2 :

ఆ..... అ

ఫలించే... 

రసాలే

తరిచి తరించే...
పడుచు నిషాలో..

కవిత లిఖించే... 
యువత పెదాల... 

సుధలు పొంగించగా...
సన్నజాజి తొడిమలో... 
చిన్ని వెన్నెలమ్మ
సందె వెలుగులోనే... 
తానమాడునమ్మ

కన్నె చూపులే... 

కసి కసి కసి కసి
కారు మబ్బులై... ముసరగ...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా...పదసని 
నీ... గసరిద 
ద... సనిదమ
మా...నిదమగ 
గ... గమగమ దని...

సా సాయమడుగు  
నీ నీ పరువము 
ద దాగ దిపుడు
మ మాఘ మేడల 
గ.. గాఢపు 
మ..మమతల 
పూలు కోసి మాలుకోసు పలికించే....

కు కు కు కు కూ.