పెదవి దాటని మాటొకటుంది


మనసు చాటున ఎందుకు ఉంది?
తమ్ముడు (1999)
సిరివెన్నెల
గోగుల రమణ
రమణ గోగుల, సునీత.

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా

నేలమ్మా నింగమ్మా



నేలమ్మా నింగమ్మా
ఆడదే ఆధారం (1987)
సిరివెన్నెల
శంకర్-గణేష్
బాలు

పల్లవి:

నేలమ్మా నింగమ్మా 
నీరమ్మా నిప్పమ్మా
గాలమ్మా కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం… 
సంగమం..

దమ్ముతోటి దగ్గుతోటి సలిజొరమొచ్చిన అత్తో


మరెప్పుడొస్తారు తల్లా దవాఖానకు 
సినిమా:- నేటి భారతం (1983)
సాహిత్యం:- కృష్ణస్వామి
సంగీతం:- చక్రవర్తి
గానం:- శైలజ, (వందేమాతరం) శ్రీనివాస్

దమ్ముతోటి దగ్గుతోటి సలిజొరమొచ్చిన అత్తో
అత్తో పోదాం రావే మన ఊరి దవఖానకు
దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొచ్చిన అత్తో
దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొచ్చిన అత్తో
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు

మందులు, గోలీలు, మంచి సూదులు ఇత్తన్రంట
మందులు, గోలీలు, మంచి సూదులు ఇత్తన్రంట
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు 

తెలుసా నేస్తమా


తెలుసా నేస్తమా
సింహరాశి (2001)
వెనిగెళ్ళ రాంబాబు
ఎస్.ఏ.రాజ్ కుమార్
హరిహరన్, చిత్ర

తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

నే పాడితే లోకమే పాడదా



నే పాడితే లోకమే పాడదా
మిస్సమ్మ (2003)
భువనచంద్ర
వసుంధరాదాస్
వందేమాతరం శ్రీనివాస్

నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్
నాలోనే ఉంది జాయ్
మజాగ మస్త్ మారో యారో
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా

అంజలీ అంజలీ పుష్పాంజలీ


అంజలీ అంజలీ
డ్యూయెట్ (1994)
వెన్నెలకంటి 
ఏ.ఆర్.రెహమాన్
చిత్ర, బాలు

పల్లవి:

అంజలీ అంజలీ పుష్పాంజలీ
అంజలీ అంజలీ పుష్పాంజలీ

పువ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

ఎద నింగీ... మేఘమే తాను


కు కు కుక్కుకు కుక్కు
ప్రియా... ప్రియతమా (2009)
టిప్పు
విద్యాసాగర్

కు కు కుక్కుకు కుక్కు కుక్కుకు
ఎద నింగీ... మేఘమే తాను
స్వరగంగ రాగమే తాను...
పగలొచ్చే తారకే తానూ...
తానేలే నా చెలియా...

హరివిల్లు చిన్నెలే తాను...
విరిజల్లు చినుకులే తానూ...
వెదజల్లే వెన్నెలే తాను...
తానేలే నా చెలియా...

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి



నాగమల్లి అప్పడిగింది
ఆది (2002)
చంద్రబోస్
మణిశర్మ
మల్లికార్జున్, సునీత

పల్లవి:

నీ నవ్వుల తెల్లదనాన్ని 
నాగమల్లి అప్పడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...
నీ పెదవుల ఎరద్రనాన్ని 
గోరింటాకే అరువడిగింది 
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ...

పగలే వెన్నెలాయే జగమే మనదాయే


మన్మధుణ్ణే మధ్యవర్తై ఉండమందాం ...
చిత్రం : పరువు ప్రతిష్ట (1993)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే
స్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకో
దాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో

పగలే వెన్నెలాయే జగమే మనదాయే
సెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే

రేపల్లె మళ్ళీ మురళి విన్నది



మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
చిత్రం: అల్లరి మొగుడు (1990)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి :

తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది... తననం
ఆ జానపదం ఘల్లు మన్నది .. తననం
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక .. తననం

రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది...