జీవన వేణువు పాడెను



జీవన వేణువు పాడెను
సూర్యచంద్ర (1985)
సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::వేటూరి
గానం::సుశీల, రాజ్ ‌సీతారామ్

పల్లవి::

జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..
పూజనీ నీ పూజనీ

జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..పూజనీ నీ పూజనీ

నీ కొంగున బంగరు రంగులతో


నీ కొంగున బంగరు
పొరుగింటి పుల్లకూర(1976)
సంగీతం: చక్రవర్తి
రచన: దాశరథి
గానం: బాలు, సుశీల

పల్లవి :

నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా
నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా

నీ మెరిసే మురిసే బుగ్గలపై..ముద్దుల బొమ్మలు గీసేనా
ముద్దుల...బొమ్మలు గీసేనా
నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా


నేస్తమా...
చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గురుచరణ్
గానం: బాలు, గోపికా పూర్ణిమ

మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం
నింగీ నేలా నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు
ఉహుఁ ఈ అందాలన్నీ చూడలేని నాకళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

నేస్తమా ఇద్దరి లోకం ఒకటేలేవమ్మా 
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా

ఈ గుండెలోన నీ ఊపిరుంటే... 
ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే....
ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే...
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే....

తారలెంతగా మెరిసేను


తారలెంతగా
అక్బర్-సలీం-అనార్కలి (1978)
సంగీతం: C.రామచంద్ర
రచన: సినారె
గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

తారలెంతగా మెరిసేనో..
తారలెంతగా మెరిసేనో
చందురుని కోసం 
చందురుని కోసం
రేయి ఎంతగా మురిసేనో..
రేయి ఎంతగా మురిసేనో
దినకరుని కోసం 
దినకరుని కోసం
తారలెంతగా మెరిసేనో

లేలే బాబా నిద్దుర లేవయ్యా


లేలే బాబా నిద్దుర
చిత్రం : కుంతీపుత్రుడు (1993)
రచన : జాలాది
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు

పల్లవి :

ఆ ఆ ఆ... ఓ... ఆ... ఓ... ఆ...
లేలే బాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా
రవితేజ కిరణమే నీ శర ణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లేలే... లేలే... లేలేబాబా నిద్దుర లేవయ్యా
ఏలే స్వామి మేలుకోవయ్యా

నవ్వవయ్య బాబూ...


నవ్వవయ్య బాబూ...
పెదబాబు (2004)
చక్రి
చక్రి, కౌసల్య, జగపతిబాబు 

నవ్వవయ్య బాబూ...
నీ సొమ్మేం పోతుంది...
నీ సోకేం పోతుంది ||౨||

నవ్వు దొరబాబూ...!
అరె నీ కేమయ్యింది
చిరునవ్వే రాకుందీ ||౨||

ఆడదిలా వెంటపడీ అడుగుతుండగా
మూతినలా ముడుచుకునీ ఎంతసేపటా...
తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే
నవ్వు చినుకులే...

నాలో నువ్వుండాలి...


నాలో నువ్వుండాలి...
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బాలు, కౌసల్య

నాలో నువ్వుండాలి... నీలో నేనిండాలి
నువ్వే నేనవ్వాలి ఏనాటికీ
నా వెంట నడిచాకా....నా చెంతే చేరాకా
నువ్వంటే నేనేగా ముమ్మాటికీ
వద్దన్నా వినకుండా నువు సాయం చేస్తుంటే
పదిమందీ చూశారా బాగోదులే
ఎవరేమీ అనుకున్నా ఎగతాళే చేస్తున్నా
నీ సేవలో నిత్యం వుంటానులే...

ఓలమ్మో ఓరినాయనో


ఓలమ్మో ఓరినాయనో
పెళ్ళాంతో పనేంటి (2003)
ఎస్వీ కృష్ణారెడ్డి...
చంద్రబోస్
ఉదిత్ నారాయణ్, రనీనా రెడ్డి

పల్లవి: 

ఆదివారం షికారుకి 
సోమవారం సినిమాలకి 
మంగళారం రెస్టారెంటుకి 
శుక్రవారం రాముని గుడికి 
అన్నిచోట్లకి నాతో తిరిగి 
ఆఖరికి నను మరిచి పోయాడ్రో ...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో..

ఆదివారం ఆఫీసుకి
సోమవారం షాపింగుకి 
మంగళారం మధురై బ్యాంకుకి 
శుక్రవారం చెన్నై బ్రాంచికి
అంతులేని బిజీగా ఉంటే 
ఇంతలో నీ గజిబిజి ఏందమ్మో...
ఓలమ్మో 
ఓలమ్మో ఓరినాయనో

మరల తెలుపనా ప్రియా


మరల తెలుపనా
చిత్రం : స్వయంవరం(1999)
గానం : చిత్ర
రచన: భువనచంద్ర
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

మరల తెలుపనా
మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని -
మరల తెలుపనా||

దొరల నీకు


దొరల నీకు
చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

దొరలనీకు కనుల నీరు
దొరలదీ లొకం,  మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శోకం
కన్నె పడుచు లా శోకం

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాలుగు పాదల ధర్మం నడవలేని ప్రగతిలో
నాలుగు స్తంబాల ఆట ఆడ బ్రతుకు తెలుసుకొ