Showing posts with label తులసి (2007). Show all posts
Showing posts with label తులసి (2007). Show all posts

వెన్నెలింత వేడిగా


వెన్నెలింత వేడిగా
చిత్రం: తులసి (2007)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గాయకులు: వేణు, సునీత
రచన: చంద్రబోస్

పల్లవి:

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా!
చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా!

చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నేలపై మేఘాలూ ఆకాశంలో గోదావరి చేరాయే నువ్వు చూడగా
// వెన్నెలింత //

చరణం 1:

నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే
నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే
తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట
మెత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా మనజంటే కనిపెట్టాలంటా
// వెన్నెలింత //

చరణం 2:

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే
నేలైనా నిను తడితే ఎదలో అసూయ పెరిగిందే
గాఢంగా, గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నోజన్మలు సృష్టించాలటా
// వెన్నెలింత //

నీ కళ్ళతోటి


నీ కళ్ళతోటి
తులసి (2007)
దేవిశ్రీప్రసాద్
భాస్కరభట్ల
సాగర్, చిత్ర

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం…

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనె చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

అడుగునౌతాను నీవెంట నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వు నౌతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళ లోన తోలి సిగ్గు నేనవ్వనా....

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

వెన్నెలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా
వూపిరౌతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి పోతాను పారాణిలా
చిరుచెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలి లా..