May 1, 2020

నూనూగు మీసాలోడు


నూనూగు మీసాలోడు
యమదొంగ (2008)
కీరవాణి
అనంత్ శ్రీరాం
సునీత, కీరవాణి

డ డ డ డి డి డి డు డు డు డు ...
డ డ డ డి డి డి డు ...
ఊమ్ ...
ఊమ్ ...
ఊమ్ ...
నూనూగు మీసాలోడు ... ఊమ్ ...
నీ ఈడు జోడైనోడు ... ఊమ్ ...
నీ వైపే వస్తున్నాడు ...డు ...
ఊమ్ ...
కళ్ళల్లో కసి వున్నోడు ... ఊమ్ ...
కండల్లో పస వున్నోడు ... ఊమ్ ...
వచ్చేసాడొచ్చేసాడు ...డు ...
నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు
జొన్నపొత్తులతోటి గూడే కట్టి ...
ఏంచేస్తాడు ...
ఇచ్చేస్తాడు ...ఊమ్ ...
నూనూగు మీసాలోడు ... ఊమ్ ...
నీ ఈడు జోడైనోడు ... ఊమ్ ...
నీ వైపే వస్తున్నాడు ...డు ...

చరణం 1:

చెంగు చాటు బిందె పెట్టి
చెరువు కాడికొస్తుంటే ...
చెంత కొచ్చి ఆరాతీస్తాడు ...
బిందె నిండి పోయిందంటే
బరువు మొయ్యలేవంటూ ...
సాయం చేస్తే తప్పేంటంటాడు ...?
ఊ...సాయమేమి కాదోయ్ ...
చెయ్యి కొంత జరిపి 
నడుముకి పైపైనే ఆనిస్తాడు ...
తస్సదియ్య అక్కా ... అక్కర్లేదే తిక్కా ...
ఇకపై ఆ పనినే కానిస్తాడు ...
పెద్ద దొంగోడమ్మా దొంగోయ్ బుల్లోడు ...
ఇంత బంగారమే ముందే వుంటే ...
ఏంచేస్తాడు ... దోచేస్తాడు ...

ఆ ... నూనూగు మీసాలోడు ...
ఆ ... నీ యీడు జోడైనోడు ...
ఊమ్ ... నీవైపే వస్తున్నాడు ... డు ...
ఊమ్ ...కళ్ళల్లో కసి వున్నోడు ...
ఊమ్ ... కండల్లో పస వున్నోడు ...
ఊమ్ ... వచ్చేసాడొచ్చేసాడు ... డు ...
ఇంకా ఏంచేస్తాడో మళ్ళీ ఈనాడు ...
లంకెబిందెల్లోన పాలే పోసి ...
అబ్బ ఏంచేస్తాడు ... తోడేస్తాడు ...

చరణం 2:

ఓ రోజు ...
రేయి పూట సినిమా హాల్లో ...
రెండో ఆటకెళ్ళాక ...
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు ...
సచ్చినోడు ...
పాపమేమి చేసాడండి ...
పల్లెటూరి చిన్నోడు ...
పాప్ కారన్ పొట్లం ఇచ్చాడు ...
ఇచ్చినట్టే ఇచ్చి ... మీద మీద పోసి ...
అరెరే...అరరే అని తడిమేసాడు ...
అమ్మ నంగనాచీ
నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు ...
ఎంత నాటోడైన వీడే నావోడు
ఇంత బంగారమే సొంతం ఐతే ...
ఏంచేస్తాడు ... దాచేస్తాడు ...
ఊమ్ ...
నూనూగు మీసాలోడు ...
ఊమ్ ... నీ ఈడు జోడైనోడు ...
ఊమ్ ... నీవైపే వస్తున్నాడు ... డు ...
ఊమ్ ... కళ్ళల్లో కసి ఉన్నోడు ...
ఊమ్ ... కండల్లో పస వున్నోడు ...
ఊమ్ ... వచ్చేసాడొచ్చేసాడు ... డు ...
వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు ...
కోడికూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు ...
వంటింట్లోనే తిష్ఠేస్తాడు