Showing posts with label నువ్వే నువ్వే (2002). Show all posts
Showing posts with label నువ్వే నువ్వే (2002). Show all posts

అయామ్ వెరీ సారీ

అయామ్ వెరీ సారీ
చిత్రం : నువ్వే నువ్వే (2002)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె.

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించీ
వదిలెయ్ క్షమించీ..
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో
డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే
తమాషాగా ట్రైలేసి చూశానే బేబే

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా
ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీక ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ...

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించి
వదిలెయ్ క్షమించి