Showing posts with label కేరాఫ్ కంచరపాలెం (2018). Show all posts
Showing posts with label కేరాఫ్ కంచరపాలెం (2018). Show all posts

ఆశ పాశం బందీ సేసేలే

ఆశ పాశం బందీ సేసేలే
చిత్రం : కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : విశ్వ
గానం : అనురాగ్ కులకర్ణి

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె
మాటుల్లోనా... సాగేనా...

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి
రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే..
నీ ఉనికి ఉండాలిగా..

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... సాగేనా...

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ ముడుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో

సిక్కు ముళ్ళు గప్పి
రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం.
నీవు పెట్టుకున్న
నమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం
నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... ఉంటున్నా...

పట్టి పట్టి నన్నే

పట్టి పట్టి నన్నే
చిత్రం : కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : రఘుకుల్
గానం : స్వీకార్ అగస్తి

పట్టి పట్టి నన్నే సూత్తాంటే
పట్టలేక ఏటో అవుతాందే
పట్టుపట్టి జోడి కట్టానే
పట్టలేని హాయే పొందానే

కొంటె పిల్ల నువ్వూ
తుంటరోణ్ణి నేనూ
రాధ ఎంట కిష్టుడ్నే

కోట రాణి నువ్వూ
తోటమాలి నేనూ
నీకు తగ్గ ఈరుణ్ణే

జట్టుకట్టు సేపట్టూ
ఒగ్గేయ్ నే నీ మీదే ఒట్టూ
ఏఏ..ఏఏ..ఓఓఓ..ఓఓఓ..

 తందన్నారె తారే తన్నాన్నే
తన్నన్నారె తారె తారారే

టిట్టీరిటి టీటీ ప్యాంప్యాంప్యాం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాంట్యాం..టం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాండ్యాం..ట్యాం.డ్యాం..
తరిదీ తరిదా తరిది..

రాములోరైనా సీతతోటే ఉన్నా
సూడలేదు లోకం అదేటో
తుళ్ళి ఆడుతుంటే తట్టుకోదురయ్యో
కుళ్ళుబోతు లోకం కథేటో

యే కులము గిలము బలమూ జూసి
వయసు వరస సొగసు సూసి
పుట్టుకొస్తదా రా ప్రేమ

మనసు మనసు కొంతెనేసి
తనువు తనువు మెలికలేసే
తీరేరా ప్రేమా..


సిన్నపిల్లలైనా యేళ్ళు మళ్ళుతున్నా
ప్రేమలోన అంతా ఓటేగా
లచ్చలెన్ని ఉన్నా డొక్కలాడకున్నా
ప్రేమ లక్షణాలు అవేగా

ఏ ఎతికి ఎతికి సూత్తాది కన్ను
కుదురు సెదిరి పోతది తెన్ను
జివ్వుమంటదంటా వెన్ను

సిలకపలుకే తానేమన్న
పులకరింతె నేనేం విన్నా
వలపోక వింతేనా

జట్టుకట్టు సేపట్టు
ఒగ్గేయ్ నే నీ మీదే ఒట్టూ

కస్సుబుస్సులైనా కొంటె సూపులైనా
కంటికింపులేగా ఏదైనా
సందడెంత ఉన్నా ముందరెవ్వరున్నా
నింగి అంచులోనే నేనున్నా

ఏ అడుగులడుగులేత్తా ఉన్నా
కదల మెదలకుంట ఉన్నా
అంతులేని ప్రేమేనన్నా

మాటలోరద లైతావున్నా
మౌనమంతా నిండి ఉన్నా
నీతో నేనున్నా

హేయ్..జట్టుకట్టూ సేపట్టూ
ఒగ్గేయ్ నే నీమీదే ఒట్టూ

ఏయ్..ఏ...ఏయ్..ఓఓఓఓ...

టిట్టీరిటి టీటీ ప్యాంప్యాంప్యాం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాంట్యాం..టం..
టిట్టీరిట్టి టీటీ ట్యాండ్యాండ్యాండ్యాండ్యాం..
ప్రేమకు ఉందా పరిధి