Showing posts with label కృష్ణకాంత్. Show all posts
Showing posts with label కృష్ణకాంత్. Show all posts

కల్లోలమెంటేసుకొచ్చే పిల్లగాలే


కల్లోలమెంటేసుకొచ్చే
పడి పడి లేచె మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
రచన: కృష్ణకాంత్
గానం: అనురాగ్ కులకర్ణి

కల్లోలమెంటేసుకొచ్చే పిల్లగాలే
నను చూస్తూనే కమ్మేసెనే

కల్లోని గాంధర్వకన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే

గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిథిగ నువ్వొచ్చావనే

చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
చిత్రం : గ్యాంగ్ (2018)
సంగీతం : అనిరుద్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : రాహుల్ శిప్లిగంజ్

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

ఎగిరి ఎగిరి పైకి ఎగర
తిరిగి తిరిగి మనము నవ్వగ
చిందాడి చిందాడి ఆడాలి నువ్వింక
కలిసి కలిసి దూకాలిరా ఇంక
తగ్గద్దు తగ్గద్దు మాట పదును
ఎగసె ఎగసె పైకి కదులు
ఎరుపు ఎరుపు కొపమవ్వర
ఎంత పడితె అంత లెగర

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా

వెళ్ళొద్దు అంటూనె ఆపేటివాళ్ళె ఉంటే
తరిమి చూడరా
తలపొగరుతొ ఎగిరె వాడిని
తరిమి కొట్టరా
ఆకలి అన్న వాడి ముద్ద లాగుతుంటె
ఎదురు తిరగరా
నిన్ను తగలక భయపడేల
తెగువ చూపరా
కడుతు గొడవబడిన
తిరిగి తిరగపడరా
పలుగు ఎదురుపడితె
నలిపి గెలవరా
ఎవడు తగువు పడిన
ఎవడి మాట వినక
తరిమి తరిమి కొడితె
తలుపు విరగదా

అరె పోవయ్య పోవయ్య
ఏ చోట పోవయ్య
కంట పడ్డారంటే తంటాలు మీకయ్య
అకడ ఇకడ ఎకడొ పోవయ్య
ఇటు పక్కకి వచ్చారో ఇంజరీ అవునయ్య

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు
నడి రోడ్డులోన
చిటికె మీద చిటికె వేసెరా

విరిచి విరిచి ఇరగ తోముతాం
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతాం
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతాం

ఎయ్ ఎత్తుకు పోవ్వలి పళ్ళు ఊడకొట్టాలి
వీధి వీధి తిప్పి చెప్పులతొ కొట్టాలి
కాదంటు అంటేనే ఎత్తెత్తి ఎత్తెత్తి తన్నాలి
బీద వాళ్ళ బాధ వాడింక చూడాలి
విరిచి విరిచి ఓ.. విరిచి
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతా
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతా
చిటికె మీద చిటికె వేసెరా..

నిన్నలు మరిచేలా

నిన్నలు మరిచేలా
చిత్రం: సాహో (2019)
సంగీతం: గురు రంధ్వా 
రచన: కృష్ణకాంత్ 
గానం: హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ 

సాకీ :

ఏ చోట నువ్వున్నా
ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం
లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే
నాకేమైన బాగుంటా
ధూరాల దారుల్లో
నీవెంట నేనుంటా
నన్నిలా నీలోన దాచేసా

పల్లవి:

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

చరణం 1:

ఈన్నాళ్ళ నా మౌనం
వీడాలి నీ కోసం
కలిసొచ్హే నీ కాలం
దొరికింది నీ స్నేహం
నాదన్న ఆసాంతం
చెస్తాను నీ సొంతం
రాదింక ఏ ధూరం
నాకుంటే నీ సాయం
నన్నిలా నీలోన దాచేసా

రెప్పలు మూసున్న
నే నిన్నె చూస్తారా
ఎప్పటికి నిన్నే
నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా
నిన్ను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా
నే కనిపిస్తాలే

కలిసుంటే

కలిసుంటే
చిత్రం : సాహో (2019)
సంగీతం : శంకర్ ఎహ్సాన్ లాయ్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : శంకర్ మహదేవన్,
శ్వేతా మోహన్, సిద్దార్థ్ మహదేవన్

కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే
నిలిచుందా నాకోసమే

కరిగిందా ఆ దూరమే
వదిలెళ్ళా నా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

నీకంటూ సరిపోనని
అనుకున్నా రావద్దనీ
అటుపైనే తెలిసిందిలే
నేనుందే నీలో అనీ

విడదీసే సందేహమే
వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే
కోపాలే కాలాయిలే

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

 (Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

  ఇంతింత దూరాలే చేరి
పంతాలు వీడాలి మనసే
నిజమేమిటో
తెలియదా అదే క్షణం

నిద్దరలో లేకున్నా కల
నేడొచ్చి నీ కళ్ళు చేరేలా
చూపించనా
ఆనాటి గురుతులే

నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేనూ కన్నాలే
నీచేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చి
నీ కళ్ళముందుంది చూడవా

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||

(Baby Won't you tell me
 Oh tell me, Oh tell me
Baby Won't you tell me so) ||2||