తెలంగాణా జానపదం
గానం: మంగ్లీ, నాగవ్వ
సంగీతం: సురేశ్ బొబ్బిలి
రచన: కమల్ ఎస్లావత్
పల్లవి:
బాయిలోనే బల్లి పలికే ..
బండసారం శిలలొదిలే
బాయిలోనే
ఎర్రాని మావొల్ల శేతికి ..
ఏడువేలా జోడుంగురాలో
ఎర్రాని
గుండ్లు గున్నాలు ఆ శెంపశేర్లు
ఇంపుగ శింగారించుకుని
సన్నా సన్నాని జాజులు సందేల
మోజుగ ముడుసుకోనొస్తిని
బాయి బాటెంట బంతిపువ్ తోటెంట
పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా
బాయిలోనే…
బాయిలోనే బల్లి పలికే ..
బాయిలోనే బల్లి పలికే ..
బండసారం శిలలొదిలే బాయిలోనే
బాజరులా బాలలంత..
బాజరులా బాలలంత..
బత్తీసాలాడంగో బాజరులా