చిత్రం: రేచుక్క (1985)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గాయకులు: సుశీల, బాలు
సంగీతం: జె.వి.రాఘవులు
పల్లవి :
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం
తలవంచావా అపజయమే
ఎదిరించావా విజయం నీదే
భయము జయము చుక్కెదురేరా
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం
దీంతనకదిన...
చరణం 1:
అందరూ కారురా నీవారు
నీవారెక్కడో ఉంటారు
అందరు వెళ్ళిన సమయంలో
ఆదుకునాలనే హృదయంతో
వచ్చేవారే మనసిచ్చేవారే
నేడూ రేపూ
అయినవారు....
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం
దీంతనకదిన...
చరణం 2:
ధనముండాలి బ్రతికేటందుకు
మనసుండాలి మనిషయ్యేందుకు
మనిషుండాలి ప్రేమించేందుకు
ప్రేమించాలి ఒక్కటయ్యేందుకు
అనుకోవాలి ఒకరికిఒకరని
నాడే ధన్యం అందరి బ్రతుకు
జీవించు నీ జీవితం
సాధించు నీ ఆశయం