పిలిచే వయసు
మండే సూర్యుడు (1992)
సంగీతం: దేవా
గానం: బాలు, జానకి
రచన: రాజశ్రీ
పల్లవి:
పిలిచే వయసు పలికే సొగసు
తలఁచెను మదిలోనా
మల్లెల తలపు, అల్లరి వలపు
చిలికెను విరివానా
కలలై పొంగి ఎద ఉప్పొంగి
ఆశలు ఉరికేనే
నాలో లోలో సవ్వడి చేసి
చరణం 1:
మాటలు రాని మనసున ఏదో
పులకరించి నిను కోరి
నీ పైటకొంగు జత చేరి
నవ్వుల వాడ పువ్వుల మేడ
సిరులు కోటి నీవంట
ఇక నేను కాన నీ జంట
ఊహలు రేపు నీ కొనచూపు
తేనెలు కురిసేనే
కోరికలే ఈ కమ్మని వేళా
సందడి చేసేనే
రాతిరి మనకు తొలిరాతిరీ
బంధనం ప్రియబంధనం
మన కథ ఇక పలికెను ఇక తేనె స్వరమై
కోరస్:
వయ్యారాల బావను చూస్తే
మరదలు కరిగేనే
సూర్యుడు వెలసి ఓరగ చూస్తే
తామర విరిసేనే
చరణం 2:
మాయని రాగం నీ అనురాగం
మాయని రాగం నీ అనురాగం
పలవరింతలే సాగే
నా పాలమనసు ఊరేగే
ముద్దులు పూచే పొద్దులు తెలిసే
కలవరింతలే రేగే
నా ఎదల కథలు చెలరేగే
మన్మథబాణం వేసే సమయం
వేడుక చిందించే
మగసిరి తోడై వీడని నీడై
వలపే అందించే
చూడనీ... ముచ్చటలు పాడనీ
నీ ఒడి నను వాలనీ
నీ వన్నెలు చిన్నెలు తాగు వేళా
కోరస్:
మంగళససూత్రం ముడివేసాక
మగడివి అయ్యావే
వియ్యం పరువం అన్నీ నీకే
విందులు అయ్యేనే