ఓం నమః శివాయ
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: వేదవ్యాస
గానం: కార్తీక్
పల్లవి:
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ.
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...
ఛాంగుభళా చమకు చమకు
తళుకు బెళుకు సృష్టికళా
హృదయమిలా ఊగే హొయలు చిలుకు
లయల కులుకు సోయగాల ఊయల
ఛాంగుభళా చమకు చమకు
తళుకు బెళుకు సృష్టికళా
హృదయమిలా ఊగే హొయలు చిలుకు
లయల కులుకు సోయగాల ఊయల
సంబరాల చుంబనాల రూపంలా
అంబరాల అబ్బురాల దీపంలా
ఎగసే... ఇంద్రచాపంలా
ఏదో... ఇంద్రజాలంలా
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ.
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...
ఛాంగుభళా సృష్టికళా
చరణం :
జాలువారె ఝలకు ఝలకు జలధారల జలజలా
జతులు గూర్చె ఝఠాఝఠలు అగ్నిశిఖల మిలమిలా
జతగూడే నింగి నేల ఒంపుల సొంపుల వలపుల
తలపుల తలుపులు తడిమిన తహతహలా
జాణతనము జలదరింప సేదతీరె
వెదురు ఎదల ఈడొచ్చిన పిల్లగాలి ఈలా
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ.
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...
ఛాంగుభళా చమకు చమకు
తళుకు బెళుకు సృష్టికళా
హృదయమిలా ఊగే హొయలు చిలుకు
లయల కులుకు సోయగాల ఊయల
సంబరాల చుంబనాల రూపంలా
అంబరాల అబ్బురాల దీపంలా
ఎగసే... ఇంద్రచాపంలా
ఏదో... ఇంద్రజాలంలా
లెక్కలేని జీవరాశి ఒక్కటైన ఊసులా
ఒకే శక్తి ఊపిరాయె ఓంకారంలా
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ.
ఓం నమః శివాయ
ఏమిటి ఈ మాయ...