May 27, 2023

చిన్నితండ్రీ నిను చూడగా

చిన్నితండ్రీ నిను చూడగా
చిత్రం: సిసింద్రీ (1995)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్వర్ణలత

పల్లవి:

చిన్నితండ్రీ నిను చూడగా
వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా
నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ వొడిలోనే దాగుండిపోరా

చిన్నితండ్రీ నిను చూడగా
వేయి కళ్ళైన సరిపోవురా

చరణం 1:

ఏ చోటా నిమిషం కూడా వుండలేడు
చిన్నారి సిసింద్రిలా చిందు చూడు
పిలిచినా పలకడు 
వెతికినా దొరకడు
మా మధ్య వెలిశాడు ఆ జాబిలీ
ముంగిట్లొ నిలిపాడు దీపావళీ
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు

చరణం 2:

ఆ మువ్వగోపాలుళ్ళా తిరుగుతుంటే
ఆ నవ్వె పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసులో నందనం 
విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులె హరివిల్లుగా
మా ఇంటి గడపలె రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికీ యువరాజు వీడూ

చందమామా చూసావటోయ్ 
అచ్చు నీలాంటి మా బాబునీ
నేల అద్దాన నీ బింబమై 
పారాడుతుంటే
చందమామా చూసావటోయ్ 
అచ్చు నీలాంటి మా బాబునీ...