ఒంటరైన గుండెలో
చిత్రం: మౌనం (1995)
సంగీతం: కీరవాణి
రచన: సిరివెన్నెల
గానం: బాలు, చిత్ర
పల్లవి:
ఒంటరైన గుండెలో
తీగలేని వీణలు
మోగుతున్న మూగరాగమేమో
నిద్రలేని నిన్నని
మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో
సుదూర తీరాల జ్ఞాపకాలే
సమీపమౌతున్న జాడలా
చరణం 1:
కంటిచాటు సాగరాలు ఇంతకాలమేడదాగెనో
అనురాగ సంగమం ..ఈ క్షణమే
రెప్పదాటు ఉప్పునీట చెప్పలేని తీపి ఏవిటో
కరిగించు ఈ క్షణం ..అమృతమే
సుమాలు తుంచిన గతాల మంచునే
క్షమించి చేరువైన తేనెజల్లిది
చినుకు వంతెనెంత చేరుకుంది నీలినింగి నేలకి
చిగురు తొడుగు తడిని తెలపదా
ఏడేడు జన్మాల స్నేహాలతో
చరణం 2:
వేడిశ్వాస వేణువైన నాడిలోని నాదమేవిటో
తెలవారు వేళకై... స్వాగతమే
ఓడిగెలుచు ఆశలోన భాషలేని భావమేవిటో
ఒడి చేరు ఊసులో... సంబరమే
తనంత తానుగా వసంత వాకిట
ఎడారి దారి చేరి పూలు పూయగా
కలల కోకిలమ్మ పాడుతోంది మనసు మావితోటలో
చెలిమి చిలుకు ఛైత్రగీతిగా
తియ్యంగ తీరేటి దాహాలతో