July 29, 2023

ఎవడు నేను

ఎవడు నేను
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: జె.కె.భారవి
గానం: బాలు 
 
ఎవడు నేను
ఎవడు నువ్వు 

ఎవడు నేను
ఎవడు నువ్వు

ఎవడు నేను
ఎవడు నువ్వు

ఎవడు దేవుడు 
ఎవడు జీవుడు

గురువు ఎవ్వడు
శిష్యుడెవ్వడు

కర్త ఎవ్వడు 
భర్త ఎవ్వడు  

తెలిసినోడెవడూ
తెలుపువాడెవడు  

ఆది ఏది 
అనాది ఏది
చిత్తు ఏది 
అచిత్తు ఏది 

ఏది విద్య  
ఏది మిధ్య

ఏది మాయ 
ఏది మర్మం

ఏది ధర్మం 
ఏది గమ్యం

ఏది శాంతం 
ఏది సౌఖ్యం 

ఎందుకీ దుఃఖం
ఏమిటీ ద్వాంతం  

ఎప్పుడో అంతం 

పుట్టుటేమిటో 
గిట్టుటేమిటో 

పుణ్యమేమిటో 
పాపమేమిటో 

కాలమేదో 
కర్మమేదో 

బంధమేదో 
భ్రాంతి ఏదో 

సత్యమేదో 
నిత్యమేదో 

మార్పు ఏదో
మార్గమేదో 

ఎఱుక చెప్పే హంస 
ఎవడో ఎక్కడున్నాడో 
ఎప్పుడొస్తాడో.....