July 4, 2023

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

పల్లవి:

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

చరణం 1:

తనువులోన అణువణువున తరతరాల పోరాటం
తన రూపే దాల్చింది ఝాన్నీరాణి కరవాలం
జలియన్‌వాలాబాగున జరిగిన మారణకాండ
తలచి ఎగురవేశాడు తిరుగుబాటు ఝండా...   
తిరుగుబాటు ఝండా...

చరణం 2:

కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు
కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు
ఎలుగెత్తెను ఆ కంఠం మనదేరాజ్యం
జపియించెను ఆ వదనం "వందేమాతరం”

చరణం 3:

వందేమాతరమంటూ నినదించిన బంగాళం
స్వరాజ్యమ్ము జన్మహక్కు అని చాటిన మహరాష్ట్రం
హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం
అన్నిటికీ నెలవాయెను ఆంధ్ర వీరహృదయం
రామరాజు హృదయం