Showing posts with label మధు బాలకృష్ణన్. Show all posts
Showing posts with label మధు బాలకృష్ణన్. Show all posts

భజ గోవిందం

భజగోవిందం అనే పాట ఊసుపోక ఏదో భగవంతుడిని గురించి మాత్రమే చెప్పుకునే మూఢ భక్తి  గీతం కాదు. దానిలో ఉన్న అర్ధాన్ని, పరమార్ధాన్నీ ఒక్కసారి గమనించండి. పాట దాని తాత్పర్యం ఈ క్రింద వివరింపబడినది. 

భజ గోవిందం
చిత్రం: జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం: నాగ శ్రీవత్స
సాహిత్యం: ఆది శంకరాచార్యుడు
గానం: మధు బాలకృష్ణన్ 
 
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే 

భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.