February 18, 2020

ఈ తీయని రేయి


ఈ తీయని రేయి
చిత్రం: చిట్టితల్లి (1972)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
గీతరచన: జి. కె. మూర్తి
గానం: బాలు, జిక్కి

ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ
ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ
చరణం 1 :

నీ లేడి కన్నులలోనా
నీ లేత వన్నెలలోనా
నీ లేడి కన్నులలోనా
నీ లేత వన్నెలలోనా
తీరైన లోకాలన్నీ
తిలకించనీ... తిలకించనీ
మరుమల్లె మాలికనోయి
మరులున్న బాలికనోయి
మురిపించు మురళిని నేనై
వినిపించనీ...వినిపించనీ

చరణం 2 :

నీ నడక సొంపులలోనా
లేనడుము ఒంపులలోనా 
నీ నడక సొంపులలోనా
లేనడుము ఒంపులలోనా 
ఎనలేని వయ్యారాలు
కనిపించనీ...కనిపించనీ
నీ హృదయసీమను చేరి
నీ పెదవి నవ్వుగ మారీ
అందాల ఆనందాలు
అందించనీ...అందించనీ

ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ
ఈ తీయని రేయి తెలవారుటె మానీ
ఇలా నిలిచి కవ్వించనీ