కుర్రాడనుకొని కునుకులు తీసే
చిత్రం: చిలకమ్మ చెప్పింది (1977)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
కుర్రాడనుకొని కునుకులు తీసే
హహ
వెర్రిదానికీ పిలుపూ ఊ...
కుర్రాడనుకొని కునుకులు తీసే
వెర్రిదానికీ పిలుపూ..
ఇదే నా మేలుకొలుపుచరణం 1:
మల్లెలు విరిసే
మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
మల్లెలు విరిసే
మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
దీపమంటి రూపముండి
దీపమంటీ రూపముండి
కన్నె మనసే చీకటి చేయకు
కన్నె మనసే చీకటి చేయకు
కుర్రాడనుకొని కునుకులు తీసే
వెర్రిదానికీ పిలుపూ..
ఇదే నా మేలుకొలుపు
చరణం 2:
వెన్నెల చిలికే
వేణువు పలికే
వేళ నీకిది నా తొలి పలుకు
వెన్నెల చిలికే
వేణువు పలికే
వేళ నీకిది నా తొలి పలుకు
మూగదైన రాగవీణ
మూగదైన రాగవీణ
పల్లవొకటే పాడును చివరకు
పల్లవొకటే పాడును చివరకు!
హహహ
కుర్రాడనుకొని కునుకులు తీసే
వెర్రిదానికీ పిలుపూ..
ఇదే నా మేలుకొలుపు