పదే పదే కన్నులివే
చిత్రం: అనురాగం (1963)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
ఆ హా హాహా
ఓహో ఓహో
ఆ హా హాహా
ఓ హో ఓ హో
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకుపదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
చరణం 1:
ఆ... ఓ... ఆ... ..
దవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..
ఏమనెనో...
ఏమనినా... ఒంటరితనమింక చాలుచాలనే
దవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..
ఏమనెనో
ఏమనినా ఒంటరితనమింక చాలుచాలనే
ఓ ఓ ఓ ఓ ...
పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
చరణం 2:
చల్లని గాలి నీవైతే ..
కమ్మని తావీ నేనౌతా
కొమ్మవు నీవై రమ్మంటే ..
కోకిల నేనై... కూ అంటా
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకూ..
జాణవులే
జాణవులే.. చూపులతో బాణమేసినందుకు ...
ఓ ఓ ఓ ...
పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు
ఆ హా హాహా
ఓహో ఓహో
ఆ హా హాహా
ఓ హో ఓ హో
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు...
పదే పదే కన్నులివే బెదరునెందుకు
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు